Friday, July 17, 2026
Chat on WhatsApp
HomeNationalHydrogen Train | మేక్ ఇన్ ఇండియా సత్తా.. దేశ తొలి హైడ్రోజన్ ట్రైన్ ను...

Hydrogen Train | మేక్ ఇన్ ఇండియా సత్తా.. దేశ తొలి హైడ్రోజన్ ట్రైన్ ను ప్రారంభించిన మోడీ

-

Chat on WhatsApp

భారత రైల్వేలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. పర్యావరణ హిత రవాణా దిశగా దేశం ముందడుగు వేస్తూ తొలి హైడ్రోజన్‌ ఆధారిత రైలు(Hydrogen Train)ను ప్రారంభించింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సోనిపట్‌ వరకు ఈ రైలు ప్రయాణించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) జెండా ఊపి ఈ హరిత రవాణా సర్వీసును ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా భారత రైల్వే ఈ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Hydrogen Fuel:
హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌తో పనిచేసే ఈ రైలు నుంచి సాధారణ డీజిల్‌ రైళ్ల మాదిరిగా పొగ విడుదల కాదు. బదులుగా నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతాయి. దీంతో కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జింద్‌ స్టేషన్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీతో పాటు రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Make in India:
‘మేక్‌ ఇన్‌ ఇండియా’(Make in India) కార్యక్రమంలో భాగంగా దేశీయ సాంకేతికతతో ఈ హైడ్రోజన్‌ రైలును అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో పర్యాటక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన మార్గాల్లో మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పచ్చ ఇంధన వినియోగంలో భారత రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం హరిత రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Prime Minister Narendra Modi addressing a public event in Chandigarh

TB-Free Mission India | టీబీకి చెక్.. దేశానికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ

TB-Free Mission India: దేశాన్ని క్షయవ్యాధి (టీబీ) రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం...
- Advertisement -
Chat on WhatsApp