Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeInterNationalBison Attack | అడవి దున్న ఉగ్రరూపం.. పర్యాటకుడిపై దాడి చేసిన బైసన్, వీడియో వైరల్

Bison Attack | అడవి దున్న ఉగ్రరూపం.. పర్యాటకుడిపై దాడి చేసిన బైసన్, వీడియో వైరల్

-

Chat on WhatsApp

Bison Attack: ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ పర్యాటకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో భారీ బైసన్ ఆకస్మికంగా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. వ్యోమింగ్ రాష్ట్రంలోని బ్రిడ్జ్ బే క్యాంప్‌గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన మనవడితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నడుస్తున్న ఓ వృద్ధుడు, దగ్గర్లో ఉన్న బైసన్‌ను మొబైల్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో బైసన్ అనూహ్యంగా దూకుడుగా మారి పర్యాటకుల వైపు పరిగెత్తింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఇద్దరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. మనవడు వేగంగా తప్పించుకోగా, వృద్ధుడిని బైసన్ లక్ష్యంగా చేసుకుంది. తన కొమ్ముతో బలంగా ఢీకొట్టడంతో ఆయన గాల్లోకి ఎగిరిపడి కిందపడిపోయారు. అక్కడే ఉన్న పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్ వెంటనే వీడియో తీయడం ఆపి, ఇతరులతో కలిసి బైసన్‌ను అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నంతో ఆ జంతువు వెనక్కి వెళ్లిపోయింది. ప్రమాదంలో గాయపడిన పర్యాటకుడికి ఘటనాస్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించిన అత్యవసర సిబ్బంది, అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

ఘటన అనంతరం ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అధికారులు మరోసారి సందర్శకులకు హెచ్చరికలు జారీ చేశారు. అడవి జంతువులను దగ్గరగా వెళ్లి చిత్రీకరించడం లేదా వాటి ప్రవర్తనను తేలికగా తీసుకోవడం ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా బైసన్‌ల సంతానోత్పత్తి కాలంలో అవి మరింత దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంటుందని, కనీస భద్రతా దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ntr office issues clarification on raw ntr and political entry rumours

‘RAW NTR’ ఎవరి సంస్థ? ఎన్టీఆర్ టీమ్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారాలకు ఆయన కార్యాలయం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘RAW NTR’ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు విడుదల...
- Advertisement -
Chat on WhatsApp