Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshగుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరా కలకలం

గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరా కలకలం

-

Chat on WhatsApp

ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యుంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి… న్యాయం జరగాలి… అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. 

ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరగ్గా, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

imd forecasts heavy rain in telangana for next three days

Heavy-Rain-Alert | తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

Heavy-Rain-Alert: తెలంగాణలో వర్షాల జోరు వెంటనే తగ్గే సూచనలు కనిపించడం లేదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో...
- Advertisement -
Chat on WhatsApp