Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTAkhil Akkineni | ‘లెనిన్’ విజయంతో.. తండ్రిని హత్తుకుని కన్నీళ్లుపెట్టుకున్న అఖిల్

Akhil Akkineni | ‘లెనిన్’ విజయంతో.. తండ్రిని హత్తుకుని కన్నీళ్లుపెట్టుకున్న అఖిల్

-

Chat on WhatsApp

అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తాజా చిత్రం “లెనిన్”(Lenin)కు తొలి రోజు నుంచే సానుకూల స్పందన లభిస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ విజయాన్ని ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా ఆశించిన గుర్తింపును తీసుకువస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమాకు వస్తున్న ఆదరణ నేపథ్యంలో చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోలో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో హీరో అఖిల్, నాగార్జునతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన క్షణం అఖిల్, నాగార్జున మధ్య చోటుచేసుకున్న భావోద్వేగ సంఘటన. తన తండ్రి వద్దకు వెళ్లిన అఖిల్ ముందుగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం నాగార్జునను హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. చాలా కాలంగా ఎదురుచూసిన విజయం దక్కిన ఆనందంలో అఖిల్ కంటతడి పెట్టగా, కుమారుడి భావోద్వేగాన్ని చూసిన నాగార్జున కూడా కదిలిపోయారు.

ఈ దృశ్యాలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేయడమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు అఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ విజయం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

nagarjuna emotional at akhil lenin movie success meet

Nagarjuna | ఒకే ఒక కోరిక ఆ దేవుడిని కోరుకున్న.. ఎమోషనల్ అయిన నాగార్జున

అక్కినేని అఖిల్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’(Lenin) విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. సినిమా విడుదలైన తొలిరోజే రూ.16.7 కోట్ల గ్రాస్...
- Advertisement -
Chat on WhatsApp