Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTToxic First Single | యాక్షన్ హీరో నుంచి రొమాంటిక్ స్టార్‌గా యశ్.. ‘టాక్సిక్’ ఫస్ట్...

Toxic First Single | యాక్షన్ హీరో నుంచి రొమాంటిక్ స్టార్‌గా యశ్.. ‘టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ వైరల్

-

Chat on WhatsApp

Toxic First Single: పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న యశ్ తాజా చిత్రం ‘టాక్సిక్’పై రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘తబాహి’ని తాజాగా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే గ్లింప్స్‌తో అంచనాలు పెంచిన మేకర్స్, ఇప్పుడు ఈ రొమాంటిక్ ట్రాక్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.

ఇప్పటివరకు యాక్షన్ అవతార్‌లో కనిపించిన యశ్, ఈ పాటలో మాత్రం పూర్తి భిన్నమైన షేడ్‌లో కనిపించడం విశేషం. ప్రేమ అంటే దూరంగా ఉండే వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించిన తర్వాత వచ్చే భావోద్వేగ మార్పులను ఈ పాట అందంగా చూపిస్తుంది. కియారా అద్వానీతో కలిసి యశ్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

ఈ మెలోడీకి సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా స్వరాలు సమకూర్చడమే కాకుండా తన గాత్రంతోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు వెర్షన్‌కు రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సంగీతం, విజువల్స్, లోకేషన్లు కలిపి ఈ సాంగ్‌ను రిచ్ ఫీల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. యశ్ స్టైలిష్ మేకోవర్, కియారా అద్వానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. గత చిత్రాలతో పోలిస్తే యశ్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేసినట్లు ఈ సింగిల్ స్పష్టంగా తెలియజేస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే పాటకు వస్తున్న స్పందనతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp