Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeSportsSourav Ganguly | సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు శ్రీకారం.. 'దాదా' ఫస్ట్ లుక్ వైరల్

Sourav Ganguly | సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు శ్రీకారం.. ‘దాదా’ ఫస్ట్ లుక్ వైరల్

-

Chat on WhatsApp

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) జీవితకథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. భారత జట్టుకు దూకుడు నేర్పిన నాయకుడిగా, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి కొత్త శకానికి నాంది పలికిన గంగూలీ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘దాదా’ పేరుతో బయోపిక్ రూపొందుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఈ సినిమాలో సౌరవ్ గంగూలీ పాత్రను పోషిస్తున్నారు. విడుదలైన పోస్టర్‌లో లార్డ్స్ మైదానంలో చారిత్రక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయానంతరం గంగూలీ తన జెర్సీని గాల్లో ఊపిన చిరస్మరణీయ క్షణాన్ని పునఃసృష్టించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆ సంఘటనను ఫస్ట్ లుక్‌లో చూపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, గంగూలీ అభిమానులు మరియు క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.

ఈ బయోపిక్‌ను దర్శకుడు విక్రమాదిత్య మొత్వానే తెరకెక్కిస్తున్నారు. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, నిర్వాహకుడిగా భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన సౌరవ్ గంగూలీ జీవితంలోని కీలక ఘట్టాలను ఈ సినిమా ఎంత భావోద్వేగంగా, ఎంత నిజాయితీగా ఆవిష్కరిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

pawan kalyan pays emotional tribute to deceased fan niranjan from hanamkonda

Pawan Kalyan | నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. “నీ చిరునవ్వు ఎప్పటికీ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ కొంతకాలంగా అరుదైన డీఎండీ (డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో పోరాడుతూ హైదరాబాద్‌లోని ఓ...
- Advertisement -
Chat on WhatsApp