CM Chandrababu Naidu: విశాఖపట్నం(Visakhapatnam) సముద్ర జలాల్లో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు.
కోస్ట్‌గార్డ్ నౌకల(Coast Guard)ను మరింత సమర్థవంతంగా రంగంలోకి దింపడంతో పాటు, అవసరమైతే అదనపు సిబ్బంది, సాంకేతిక వనరులను కూడా ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. సీఎంకు పరిస్థితిని వివరించిన అధికారులు ఇప్పటికే భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల సహాయంతో సముద్రంలో రెస్క్యూ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
సముద్రంలో విస్తృతంగా అన్వేషణ చేపట్టి గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. ఈ సందర్భంగా మెరైన్ ఐజీపీ, విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేసి గాలింపు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
మత్స్యకారులను క్షేమంగా రక్షించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న సీఎం చంద్రబాబు, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
CM Chandrababu Naidu | విశాఖ మసత్యకారుల ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా.. కోస్ట్‌గార్డ్, నేవీతో రెస్క్యూ వేగవంతం
-








