Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeNationalWhatsAppలో Username ఫీచర్.. యూజర్ల సందేహాలకు Meta ఫుల్ క్లారిటీ

WhatsAppలో Username ఫీచర్.. యూజర్ల సందేహాలకు Meta ఫుల్ క్లారిటీ

-

Chat on WhatsApp

WhatsApp Username: వాట్సాప్‌లో త్వరలో ప్రవేశపెట్టనున్న Username Feature గురించి వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలకు మెటా స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గోప్యత, భద్రతపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతున్న నేపథ్యంలో కంపెనీ కీలక వివరాలను వెల్లడించింది. యూజర్‌నేమ్ వ్యవస్థ పూర్తిగా ఐచ్ఛికమని, ప్రతి వినియోగదారు తప్పనిసరిగా దీనిని ఉపయోగించాల్సిన అవసరం లేదని మెటా పేర్కొంది.

కంపెనీ వివరాల ప్రకారం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ధృవీకరించబడిన ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు లేదా అధికారిక ఖాతాలు ఉపయోగిస్తున్న కొన్ని పేర్లు ప్రత్యేక రక్షణలో ఉంటాయి. అలాంటి పేర్లను ఇతరులు ఉపయోగించే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. యూజర్‌నేమ్ ఫీచర్ వచ్చిన వెంటనే ఎవరైనా మీకు నేరుగా సందేశాలు పంపగలరనే ప్రచారం కూడా నిజం కాదని మెటా తెలిపింది.

ప్రస్తుతం యూజర్‌నేమ్ ద్వారా మెసేజ్ పంపే సదుపాయం అందుబాటులో లేదని, భవిష్యత్తులో ఆ ఫీచర్ ప్రారంభమైనా కొత్త వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలపై ప్రత్యేక హెచ్చరికలు, భద్రతా సమాచారం వినియోగదారులకు చూపిస్తామని వెల్లడించింది. అదనపు రక్షణ కోసం Username Key అనే ప్రత్యేక సెక్యూరిటీ విధానాన్ని కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కీని అవసరమైతే వినియోగదారులే మార్చుకునే అవకాశం ఉంటుంది.

అలాగే వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌లను నేరుగా సెర్చ్ చేసే సౌకర్యం కూడా ఉండదని వివరించింది. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వాడుతున్న అదే యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లో ఉపయోగించాలంటే సంబంధిత ఖాతాలను లింక్ చేయాల్సి ఉంటుందని మెటా పేర్కొంది.

లేదంటే పూర్తిగా కొత్త పేరును కూడా ఎంచుకోవచ్చు. ప్రముఖుల పేర్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చనే ప్రచారాన్ని కూడా కంపెనీ ఖండించింది. ప్రస్తుతం వినియోగదారుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ఈ ఏడాది చివర్లో Username Featureను అధికారికంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Knight Riders Group | అమెరికాలో క్రికెట్ చరిత్ర సృష్టించిన నైట్ రైడర్స్.. లాస్...

అమెరికాలో క్రికెట్‌కు కొత్త దశను ప్రారంభిస్తూ నైట్ రైడర్స్ గ్రూప్(Knight Riders Group) చారిత్రక ఘనత సాధించింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సహ యాజమాన్యంలో ఉన్న ఈ ఫ్రాంచైజీ, లాస్ ఏంజెల్స్‌లో...
- Advertisement -
Chat on WhatsApp