Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeFilms News'తలవన్' సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో

‘తలవన్’ సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో

-

Chat on WhatsApp

సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో మలయాళ సీమ సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే ‘తలవన్’. బిజూ మీనన్ – అసిఫ్ అలీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. 10 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ చాలా వేగంగా 25 కోట్లకు కొల్లగొట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ వారు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదులుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి, జిస్ జాయ్ దర్శకత్వం వహించాడు. కథానాయికలుగా మియా జార్జ్ – అనుశ్రీ కనిపించనున్నారు.  

ఈ కథ అంతా ఎస్ ఐ కార్తీక్ – సీఐ జయశంకర్ చుట్టూ తిరుగుతుంది. ఒక కేసు విషయంలో కార్తీక్ నొచ్చుకునేలా జయశంకర్ ప్రవర్తిస్తాడు.ఆ లాంటి జయశంకర్ ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. అప్పుడు కార్తీక్ ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 7 భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indus Waters Treaty arbitration dispute between India and Pakistan

Indus Waters Treaty | భారత్ ఇచ్చిన షాక్‌కు పాక్ విలవిల, సింధు వివాదం.. భారత్...

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదంలో పాకిస్థాన్‌కు ఆర్థిక భారం పెరుగుతోంది. భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, విచారణ నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp