Friday, July 31, 2026
Chat on WhatsApp
HomeNationalDRDO | డీఆర్‌డీఓకి మరో ఘన విజయం.. స్వదేశీ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

DRDO | డీఆర్‌డీఓకి మరో ఘన విజయం.. స్వదేశీ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

-

Chat on WhatsApp

దేశ రక్షణ పరిశోధనల్లో డీఆర్‌డీఓ(DRDO) మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. దేశంలోనే అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) సోమవారం పరీక్షలో విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు.

పరీక్ష సమయంలో క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేరినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా మొత్తం ఫ్లైట్‌ను నిరంతరం పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ విజయంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే భారత సామర్థ్యం మరింత బలపడినట్లు పేర్కొన్నారు.

ఈ కీలక ప్రయోగాన్ని రక్షణ శాఖ ఉన్నతాధికారులు, డీఆర్‌డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్, నౌకాదళం, వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. విజయవంతమైన పరీక్షపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరియు పరిశ్రమ భాగస్వాములను అభినందించారు.

ఈ క్రూయిజ్ మిస్సైల్‌లో ఉపయోగించిన కీలక ఉపవ్యవస్థలు అన్నీ డీఆర్‌డీఓ ప్రయోగశాలలు మరియు భారతీయ పరిశ్రమల సహకారంతో పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేయడం విశేషంగా నిలిచింది. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) ఈ ప్రాజెక్టుకు ప్రధాన నోడల్ ల్యాబ్‌గా పనిచేసింది.

ఇటీవల డీఆర్‌డీఓ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థతో పాటు యాంటీ-షిప్ క్షిపణుల పరీక్షలు విజయవంతమైన నేపథ్యంలో, తాజా విజయం భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఇది మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

India Condemns Pakistan Army Over Reported Civilian Killings in PoK

PoK | శాంతియుత నిరసనలపై కాల్పులు.. పాక్ చర్యలపై భారత్ ఆగ్రహం

PoK: పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనలపై...
- Advertisement -
Chat on WhatsApp