Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeNationalటీ20 మహిళల వరల్డ్ కప్‌ 2024: భారత జట్టు ప్రకట

టీ20 మహిళల వరల్డ్ కప్‌ 2024: భారత జట్టు ప్రకట

-

Chat on WhatsApp

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఈ మెగా ఈవెంట్‌లో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది బోర్డు.  

షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ల‌తో భార‌త‌ బ్యాటింగ్ లైనప్ బ‌లంగా ఉంది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆశా శోభనా, సజన సజీవ‌న్‌ల‌తో బౌలింగ్ విభాగం కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. అటు హర్మన్‌ప్రీత్, సజన, శోభనా, దీప్తిలాంటి ఆల్‌రౌండర్లను టీమిండియా కలిగి ఉంది.

భార‌త జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), తనూజా కన్వర్, సైమా ఠాకోర్.

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘ్వీ బిస్త్, ప్రియా మిశ్రా

కాగా, ఈ తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్ అక్టోబర్ 3 నుండి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా వేదిక‌ల్లో జరగనుంది. గ్రూప్-ఏలో భార‌త్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఇక చివరి ఎడిషన్ టీ20 వరల్డ్ కప్‌లో కేప్‌టౌన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp