Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeNationalకర్ణాటకలో కొత్త అధ్యాయం.. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో కొత్త అధ్యాయం.. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

-

Chat on WhatsApp

DK Shivakumar: బెంగళూరులోని లోక్‌భవన్‌లో కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు ప్రముఖ నాయకులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

డిప్యూటీ ముఖ్యమంత్రిగా జి. పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గం విస్తరణలో ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యూటీ ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్ వంటి పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ కొత్త కేబినెట్‌తో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. కొత్త ప్రభుత్వ నేతలు రాష్ట్ర అభివృద్ధి మరియు పాలనా వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Balakrishna suffers a minor injury during NBK111 action sequence shoot in Kakinada.

NBK111 షూటింగ్‌లో గాయపడ్డ నటసింహం.. అభిమానులకు కీలక సమాచారం

నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 షూటింగ్‌ సమయంలో స్వల్ప గాయం అయినట్లు సమాచారం. కాకినాడ షూటింగ్‌ లొకేషన్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తుండగా బాలయ్యకు స్వల్ప అసౌకర్యం ఏర్పడిందని, వైద్య పరీక్షల్లో మసిల్‌ టియర్‌గా...
- Advertisement -
Chat on WhatsApp