Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeInterNationalIndian-Origin Pilot Died | విషాదం మిగిల్చిన హనీమూన్‌... భారత సంతతి పైలెట్ మృతి

Indian-Origin Pilot Died | విషాదం మిగిల్చిన హనీమూన్‌… భారత సంతతి పైలెట్ మృతి

-

Chat on WhatsApp

Indian-Origin Pilot Died: జార్జియా రాష్ట్రం (అమెరికా)లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి అనంతరం హనీమూన్ కోసం బయలుదేరిన దంపతుల హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 25 ఏళ్ల భారత సంతతి పైలెట్ ప్రాణాలు కోల్పోయాడు. డాసన్‌విల్లే కౌంటీలో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన రాబిన్‌సన్ R66 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌గా ఉన్న మరో వ్యక్తి కూడా మరణించాడు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వధువు జెస్నీ సుమారు 5 గంటల తర్వాత సజీవంగా బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఈ జంట డాసన్‌విల్లే సమీపంలోని “ది రివరీ వెడ్డింగ్” వేదికలో వివాహం చేసుకుంది. వేడుక పూర్తయిన వెంటనే వారు అట్లాంటాలోని హోటల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరారు. అదే ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుడు దవే ఫిజి తల్లిదండ్రులు కేరళలోని ఎర్నాకుళం జిల్లా నుంచి అమెరికాకు వలస వెళ్లినట్లు సమాచారం. కుమారుడి మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రమాద సమయానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడం, వర్షం మరియు పొగమంచు ఉండటంతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే నిజమైన కారణాలను నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) విచారిస్తోంది. 30 రోజుల్లో నివేదిక విడుదల కానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

RBI is preparing to test polymer currency notes

Polymer Notes | ఇక కాగితం కాదు.. ప్లాస్టిక్ నోట్లకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్..?

RBI: దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ (ప్లాస్టిక్) నోట్ల(Polymer Notes)ను ప్రవేశపెట్టే ప్రణాళికపై పని ప్రారంభించింది. తొలి...
- Advertisement -
Chat on WhatsApp