Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsOPPO Reno16 | oppo నుంచి ప్రీమియం రెనో16 సిరీస్.. ధరలు, ఫీచర్లు ఇవే

OPPO Reno16 | oppo నుంచి ప్రీమియం రెనో16 సిరీస్.. ధరలు, ఫీచర్లు ఇవే

-

Chat on WhatsApp

ఒప్పో సంస్థ తన కొత్త Reno16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో OPPO Reno16, Reno16 Pro మోడళ్లను విడుదల చేసింది. ప్రీమియం లుక్‌ను దృష్టిలో పెట్టుకుని గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో పాటు మెటల్ ఫ్రేమ్‌ను అందించింది. ముఖ్యంగా “స్టారి నైట్” వేరియంట్‌లో ఇచ్చిన 3D ఐస్ క్లియర్ ఫ్లోటింగ్ డిజైన్ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే Reno16లో 6.32 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ స్క్రీన్ ఉండగా, Reno16 Proలో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించారు. రెండు ఫోన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం Reno16లో MediaTek Dimensity 8550 ప్రాసెసర్‌ను, Reno16 Proలో శక్తివంతమైన Dimensity 9500s 3nm చిప్‌సెట్‌ను కంపెనీ అందించింది.

LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్‌తో పాటు ShanHai కమ్యూనికేషన్ చిప్, Wi-Fi యాక్సిలరేషన్ చిప్, నానో ఐస్ క్రిస్టల్ కూలింగ్ సిస్టమ్ వంటి అధునాతన టెక్నాలజీలు ఇందులో ఉన్నాయి. కెమెరా విభాగంలో రెండు ఫోన్లలోనూ 200MP ప్రధాన కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇవి 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

AI ఫీచర్లపై కూడా ఒప్పో ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక AI బటన్ ద్వారా AI One-Click Notes ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఇది స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని నోట్స్‌గా సేవ్ చేయడం, ట్రావెల్ ప్లాన్స్ రూపొందించడం, స్టడీ నోట్స్ తయారు చేయడం వంటి పనులను సులభతరం చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే Reno16లో 6700mAh బ్యాటరీ ఉండగా, Reno16 Proలో 7000mAh బ్యాటరీను అందించారు.

రెండు ఫోన్లు 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. Pro మోడల్‌లో 50W AIRVOOC వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది. ఈ ఫోన్లు IP66, IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వచ్చాయి.

స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ధరల విషయానికి వస్తే OPPO Reno16 ప్రారంభ ధర 3499 యువాన్ కాగా, Reno16 Pro ధర 4499 యువాన్‌గా నిర్ణయించారు.

కంపెనీ “OPPO Bubble” అనే కొత్త సెల్ఫీ యాక్సెసరీని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, మే 29 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp