గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు బుచ్చి బాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’(Peddi)పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్,సుకుమార్ రైటింగ్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై సోషల్ మీడియాలో కూడా భారీ హైప్ కనిపిస్తోంది.
ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ కాగా, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో జూన్ 2న ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ సెటప్‌తో పాటు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశమున్నట్లు వార్తలు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. బన్నీ ఈ వేడుకకు వస్తే ఈవెంట్ రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అలాగే అల్లు అర్జున్ స్పీచ్, ప్రెజెన్స్ సినిమాకు అదనపు హైప్ తీసుకురాగలదని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతూ ‘పెద్ది’ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
Ram Charan Peddi | పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్..? టాలీవుడ్లో హాట్ టాపిక్
-








