వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో తమపై తప్పుడు ఫిర్యాదు చేసి తమను అవమానపరిచిన తన్వీర్ అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖిలా వరంగల్ ఈద్గా కమిటీ ఎంఏ జబ్బార్ అన్నారు. ఈ మేరకు ఆయన కిలా వరంగల్ ఈద్గా మసీదులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జబ్బర్ మాట్లాడుతూ తాము సిసి కెమెరాలు ధ్వంసం చేయలేదని అన్నారు. మసీదుకు సంబంధించిన గేటు తాళం చెవి తమపై ఫిర్యాదు చేసిన వాళ్ళ దగ్గరే ఉంటాయని గుర్తు చేశారు. అదేవిధంగా డబ్బులు కూడా తాము తీసుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాము రంజాన్ మొదలైనటువంటి పండుగలకు సంబంధించి డబ్బులను కమిటీ ఆధ్వర్యంలోనే తీసి ఖర్చు చేశామని దానికి సంబంధించిన లెక్కలు కూడా తమ వద్ద ఉన్నాయని జబ్బార్ వివరించారు. పోలీసులు వాస్తవాలను పరిశీలించి విచారించాలని కోరారు. ఈ మేరకు తాము కూడా తన్వీర్ అతని అనుచరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జబ్బర్ పేర్కొన్నారు. తాము నిరంతరం ఈద్గా మసీదు అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని వివరించారు. తాము ఏ విచారణకైనా ఎక్కడికైనా సిద్ధమేనని తమపై ఫిర్యాదు చేసిన వాళ్ళు సిద్ధమేనా అని ప్రశ్నించారు . ఈ సమావేశంలో అర్ఫత్ అలీ, ఇబ్రహీం, మాశుకలి, హసన్ అలీ, బేగ్ మాషప్, జానీ భాయ్, జాకీర్, అష్రాఫ్, మద్దుమ్, మూవీస్, అంజాద్, షర్ఫుద్దీన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.