UN Security Council: అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో (UNSC) భారత్–పాకిస్థాన్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత్‌పై ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నించగా, భారత ప్రతినిధి ఆ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టారు.
సాయుధ ఘర్షణల సమయంలో పౌరుల రక్షణ అంశంపై జరిగిన బహిరంగ చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా స్పందించారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం అనుచితమని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ గత చర్యలను ప్రస్తావిస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అఫ్గానిస్థాన్‌పై జరిగిన దాడులు, కాబుల్‌లోని ఆసుపత్రిపై జరిగిన ఘటనను గుర్తుచేశారు. ఆ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగిన విషయాన్ని ప్రపంచం మర్చిపోలేదని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడుతున్న పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి చూపుతోందని భారత్ ఆరోపించింది. తన సొంత ప్రజలపై హింసాత్మక చర్యలకు పాల్పడుతూ ఇతర దేశాలపై ఆరోపణలు చేయడం కపటత్వానికి నిదర్శనమని హరీష్ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామంతో ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తన స్థాయిని స్పష్టంగా తెలియజేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
UN Security Council | ఐక్యరాజ్యసమితిలో భారత్–పాకిస్థాన్ మధ్య వాగ్వాదం… తిప్పికొట్టిన భారత్
-








