Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeInterNationalDonald Trump | అవసరమైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తా ? నాకు 99...

Donald Trump | అవసరమైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తా ? నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది

-

Chat on WhatsApp

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏదోఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తుంటారు. మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు కారణమయ్యారు. ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు, వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఇజ్రాయెల్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

అవసరమైతే తాను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసినా విజయం సాధించగలనని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచాయి.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు గొప్ప నాయకుడని, తాను చెప్పే విషయాలను గౌరవిస్తారని తెలిపారు. “నెతన్యాహు యుద్ధ కాలపు ప్రధానమంత్రి. ఆయనకు రావాల్సిన గౌరవం పూర్తిగా దక్కడం లేదు” అని వ్యాఖ్యానించారు.

ఇక ఇజ్రాయెల్ ప్రజల్లో తనకు భారీ ఆదరణ ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ తనకు 99 శాతం ప్రజాదరణ ఉందని, ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాజకీయ విశ్లేషకులు దీనిని ట్రంప్ ప్రత్యేక రాజకీయ శైలిగా అభివర్ణిస్తున్నారు.

అదే సమావేశంలో ఇరాన్‌పై కూడా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తనకు ఎలాంటి తొందర లేదని స్పష్టం చేశారు. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే “ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది” అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

మధ్యప్రాచ్య రాజకీయాల్లో అమెరికా పాత్ర, ఇజ్రాయెల్‌కు ట్రంప్ గతంలో ఇచ్చిన మద్దతు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఎన్నికల వేళ ట్రంప్ చేస్తున్న వరుస వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp