Megastar Chiranjeevi: టీజీఈఏపీసెట్‌లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఎం. రుషి(TGEAPCET topper M. Rushi) జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం చోటుచేసుకుంది. తన అద్భుత విజయంతో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన రుషిని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు.
గతంలో రుషి తండ్రి తన కూతురికి టాప్ ర్యాంక్ సాధిస్తే చిరంజీవిని కలుస్తావు అని ఇచ్చిన మాట ఇప్పుడు నిజమైంది. కూతురు సాధించిన అద్భుత విజయంతో ఆ తండ్రి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఆమెను చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా చిరంజీవి రుషిని హృదయపూర్వకంగా అభినందించి ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు.
రుషి సాధించిన ఈ విజయం విద్యార్థులకు ప్రేరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ప్రోత్సాహం ఆమె భవిష్యత్తుకు మరింత బలాన్ని ఇస్తుందని అభిమానులు చెబుతున్నారు.
Megastar Chiranjeevi | కూతురు కలను నిజం చేసిన తండ్రి… టాపర్ రుషికి మెగాస్టార్ ప్రత్యేక సత్కారం
-








