Sunday, July 5, 2026
Chat on WhatsApp
HomeNationalPM Modi Controversial Cartoon | మోడీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే మీడియాపై నెటిజన్ల ఆగ్రహం

PM Modi Controversial Cartoon | మోడీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే మీడియాపై నెటిజన్ల ఆగ్రహం

-

Chat on WhatsApp

PM Modi Controversia Cartoon: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నార్వేకు చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించిన కార్టూన్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నార్వే పర్యటనలో ఉన్న మోడీని లక్ష్యంగా చేసుకుని ఆ పత్రిక జాత్యహంకార వ్యాఖ్యలతో కూడిన కార్టూన్‌ను ప్రచురించిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కార్టూన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

నార్వేకు చెందిన aftenposten పత్రిక మోడీని పాములు పట్టే వ్యక్తిలా చిత్రీకరిస్తూ కార్టూన్‌ ప్రచురించింది. దీనికి “తెలివైన కానీ విసిగించే వ్యక్తి” అనే భావన వచ్చేలా క్యాప్షన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్టూన్‌తో పాటు భారత విదేశాంగ విధానంపై కూడా విమర్శలు చేసిన వ్యాసాన్ని ప్రచురించడం వివాదానికి మరింత కారణమైంది.

ప్రధాని మోడీ ఓస్లో పర్యటన సమయంలో ఈ కార్టూన్‌ వెలుగులోకి రావడంతో భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది పూర్తిగా జాత్యహంకార ధోరణిని ప్రతిబింబిస్తోంది” అంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా, మీడియా స్వేచ్ఛపై మోడీని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన నార్వే జర్నలిస్ట్ హెలె లెంగ్ స్వెండ్సన్ కూడా వార్తల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలు సస్పెండ్ అయ్యాయని స్వయంగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు నిలిపివేసినట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

తాను కేవలం మీడియా స్వేచ్ఛపై ప్రశ్న అడిగానని, పత్రికా స్వేచ్ఛ కోసం ఈ మూల్యాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తన ఖాతాల సస్పెన్షన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp