ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక మార్పు చేసింది. గాయపడిన యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన ప్రతిభావంతుడైన మెక్నీల్ హాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఘోష్, అదే మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడటంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతనికి కుడి కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారణ జరిగింది. ఈ మార్పుకు బీసీసీఐ అనుమతి కోరినట్లు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
24 ఏళ్ల నోరోన్హా కర్ణాటక దేశవాళీ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో గుర్తింపు పొందాడు. మహారాజా ట్రోఫీలో 13 మ్యాచ్‌ల్లో 253 పరుగులు చేయడంతో పాటు 19 సిక్సర్లు బాదాడు. అలాగే ఆఫ్ స్పిన్‌తో 10 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా తన సామర్థ్యాన్ని చూపించాడు. అతని ప్రదర్శనతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో కూడా చోటు సంపాదించాడు.
మరోవైపు చెన్నై జట్టుకు ఈ సీజన్ గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఖలీల్ అహ్మద్, ఆయుష్ మ్హాత్రే వంటి ఆటగాళ్లు ఇప్పటికే గాయపడగా, కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు.
బౌలింగ్ విభాగంలో నాథన్ ఎల్లిస్ అందుబాటులో లేకపోవడం, స్పెన్సర్ జాన్సన్ ఆలస్యంగా చేరడం జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో నోరోన్హా చేరిక జట్టుకు ఎంతవరకు బలం ఇస్తుందో చూడాలి.
ఇక సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. మే 18న హైదరాబాద్ జట్టు చెన్నైలోనే సీఎస్కేతో తలపడనుంది.








