Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRam Charan Peddi | అదిరిపోయిన ‘పెద్ది’ ప్రోమో... మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్

Ram Charan Peddi | అదిరిపోయిన ‘పెద్ది’ ప్రోమో… మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్

-

Chat on WhatsApp

Ram Charan Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’(Peddi)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ ట్రైలర్ లాంచ్ అనౌన్స్‌మెంట్ ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన తాజా ప్రోమో సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మే 18న ముంబైలో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. “పెద్ది గాడు ఇక్కడ కొడితే బాల్ ముంబైలో పడింది” అనే డైలాగ్‌తో వచ్చిన ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

టాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను నిలబెట్టేందుకు మేకర్స్ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం చర్చనీయాంశమైంది.

ప్రోమో చివర్లో చూపించిన కుస్తీ ఫైట్ గ్లింప్స్‌లో రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్ అభిమానులను ఫిదా చేసింది. క్రికెట్, కుస్తీ, పీరియాడిక్ డ్రామా ఎలిమెంట్స్ కలిపి రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ భారీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కానున్న ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp