HomeTechnology NewsiQOO Neo 10 కొత్త కలర్ వేరియంట్లు లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇవే, ధర ఎంతంటే?

iQOO Neo 10 కొత్త కలర్ వేరియంట్లు లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇవే, ధర ఎంతంటే?

-

Chat on WhatsApp

iQOO సంస్థ తన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ iQOO Neo 10కు భారత మార్కెట్లో కొత్త కలర్ వేరియంట్లను పరిచయం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇన్‌ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ రంగులకు తోడు ఇప్పుడు ఆల్పైన్ వైట్, ఆస్ఫాల్ట్ బ్లాక్ వేరియంట్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

ఆల్పైన్ వైట్ వేరియంట్‌లో లేజర్ ఎన్‌గ్రేవింగ్‌తో రూపొందించిన స్టార్ ట్రెయిల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వెలుతురు పడినప్పుడు నక్షత్రాల్లాంటి ఎఫెక్ట్ కనిపించడంతో ఈ ఫోన్ ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తుంది. ఆస్ఫాల్ట్ బ్లాక్ వేరియంట్ మాత్రం రేసింగ్ ట్రాక్ ఇన్‌స్పిరేషన్‌తో మ్యాట్ ఫినిష్‌లో ప్రీమియం ఫీల్ అందిస్తుంది.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, iQOO Neo 10లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు అందిస్తుంది. 8GB, 12GB RAM ఆప్షన్లతో పాటు 256GB స్టోరేజ్ లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా IP65 రేటింగ్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర పరంగా 8GB + 256GB వేరియంట్ రూ.37,999 కాగా, 12GB + 256GB వేరియంట్ రూ.42,999గా నిర్ణయించారు.

మే 5 నుంచి అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్, వివో స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. బ్యాంక్ ఆఫర్లతో రూ.3000 వరకు డిస్కౌంట్, నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp