Rajnath Singh: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ స్వచ్ఛందంగా నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో మాట్లాడిన ఆయన, ఈ నిర్ణయం సామర్థ్యం లోపం వల్ల కాదు, పూర్తిగా వ్యూహాత్మకంగా తీసుకున్నదని స్పష్టం చేశారు.
అవసరమైతే దీర్ఘకాల యుద్ధానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి, నిర్ణయించిన లక్ష్యాలను సాధించాక సరైన సమయంలో ఆపరేషన్‌ను ముగించామని వివరించారు. ఇది భారత సాయుధ దళాల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, అది మానవత్వానికి మాయని మచ్చగా అభివర్ణించారు. దీనిపై పోరాటం కేవలం భద్రత కోసమే కాకుండా మానవ విలువలను కాపాడేందుకు కూడా అవసరమని చెప్పారు. పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని ఆరోపించారు.
ఉగ్రవాదాన్ని వేరుతో సహా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారత్ సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచ కేంద్రంగా ఎదుగుతుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తోందని విమర్శించారు.
Rajnath Singh | మేము అనుకున్నాం కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఆపేశాం… పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఫైర్
-








