Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కీలక ప్రతిపాదనలు చేసింది. డీలిమిటేషన్ బిల్ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఈ మార్పుకు సంబంధించి ఆర్టికల్ 81ను సవరించాలని సూచిస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ సవరణ అమలైతే దేశంలో లోక్‌సభ సీట్ల నిర్మాణంలో భారీ మార్పు చోటుచేసుకోనుంది. ప్రతిపాదన ప్రకారం, రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించే అవకాశం ఉంది.
నియోజకవర్గాల జనాభా సమతుల్యత, ప్రాతినిధ్య న్యాయం లక్ష్యంగా ఈ పునర్విభజన చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. లోక్‌సభ స్థానాల పెంపుతో ప్రతి రాష్ట్రానికి మరింత సమాన ప్రాతినిధ్యం కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఎంపీలకు అందించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలు, పార్లమెంట్ ప్రాతినిధ్యం, రాష్ట్రాల శక్తి సమతుల్యతపై ఈ నిర్ణయం పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.








