TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్ బోర్డు అధికారులు ఈసారి ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటించేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఫలితాల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు స్పష్టత వచ్చింది. అధికారులు ప్రకారం ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు సాధ్యం కాకపోతే ఆదివారం విడుదల చేసేలా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి.
ఈసారి ప్రత్యేకంగా, ఒకటి లేదా రెండు మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకున్న తర్వాత ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1st year విద్యార్థులు 4,89,126 మంది, 2nd year విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు.
ఫలితాలు విడుదలైన వెంటనే మార్కులు ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే tgbie.cgg.gov.in, tsbienew.cgg.gov.in, results.cgg.gov.in మరియు manabadi.com వెబ్సైట్లలో ఫలితాలు చూడవచ్చు.
విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి “TS Inter 1st Year/2nd Year Results 2026” లింక్‌పై క్లిక్ చేసి, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయాలి.








