Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeTelanganaJeevan Reddy | కాంగ్రెస్‌పై అసంతృప్తి.. బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి క్లారిటీ

Jeevan Reddy | కాంగ్రెస్‌పై అసంతృప్తి.. బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి క్లారిటీ

-

Chat on WhatsApp

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి, తాను బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ శైలి, కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు బదులుగా వ్యక్తి ఆధారిత రాజకీయాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే ఒక్క రేవంత్ రెడ్డి అన్న భావన ఏర్పడిందని జీవన్ రెడ్డి విమర్శించారు.

పార్టీ అసలు ఆత్మ, సీనియర్ నాయకుల పాత్ర క్రమంగా తగ్గిపోయిందని, తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు సిద్ధమవడం వెనుక కారణం కూడా వివరించారు.

కాంగ్రెస్ పాలనపై ఉన్న ఆశలు నెరవేరలేదని, పరిపాలనలో స్పష్టత, స్థిరత్వం, అభివృద్ధి దిశగా ముందడుగు కనిపించలేదని అన్నారు. ఈ క్రమంలో గత కేసీఆర్ పాలనతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆయనను కలవడం, ఈ చేరికకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కట్టుబడి ఉన్న నాయకుడు ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లడం, తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

JP Nadda visiting injured protesters at RML Hospital in Delhi

JP Nadda | నీట్ వివాదంలో కీలక పరిణామం.. గాయపడిన వారిని పరామర్శించిన జేపీ...

నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసనల్లో గాయపడిన వారిని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా(JP Nadda) మంగళవారం పరామర్శించారు....
- Advertisement -
Chat on WhatsApp