Obesity Cases: హైదరాబాద్ నగరంలో ఊబకాయం సమస్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి అని తాజా ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన health of the nation 2026 నివేదిక ప్రకారం, నగరంలోని పెద్ద సంఖ్యలో ప్రజల్లో అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఈ సమస్యలో అగ్రస్థానాలకు చేరడం కలవరపెడుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ శారీరక శ్రమ, ఎక్కువసేపు కూర్చునే అలవాటు, అధిక జంక్ ఫుడ్ వినియోగం, ఒత్తిడి, నిద్రలేమి, అలాగే మితిమీరిన మొబైల్ మరియు స్క్రీన్ టైమ్ ఇవన్నీ ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణాలు.
రాత్రివేళల వరకు ఫోన్లు, ల్యాప్టాప్లు వాడటం వల్ల శరీరంలోని సహజ జీవక్రియ దెబ్బతిని, బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, షుగర్, బీపీ వంటి సమస్యలకు దారితీస్తోంది.
పిల్లల నుంచి యువత వరకు ఈ ప్రభావం కనిపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు అరుదుగా కనిపించిన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఇప్పుడు చిన్న వయసులోనే నమోదవుతున్నాయి.
ప్రస్తుత జీవనశైలి ఇలాగే కొనసాగితే రాబోయే 20–30 ఏళ్లలో గుండె జబ్బులు, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం, సరిపడ నిద్ర, స్క్రీన్ టైమ్ నియంత్రణ ద్వారా ఊబకాయాన్ని అదుపులో పెట్టవచ్చని సూచిస్తున్నారు.
అపోలో 2026 నివేదికలో దేశవ్యాప్తంగా అధిక బరువు, ఊబకాయం విస్తృతంగా ఉన్నట్లు, ముఖ్యంగా పట్టణ జీవనశైలి దీనికి కారణమని పేర్కొంది.








