Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeInterNationalUsa-Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్?...అమెరికా-ఇరాన్ మధ్య కొత్త పరిణామం

Usa-Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్?…అమెరికా-ఇరాన్ మధ్య కొత్త పరిణామం

-

Chat on WhatsApp

Usa-Iran: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఉపశమనం కలిగించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు ముందుకు సాగుతున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తి దేశాలు సిద్ధం చేసిన ఒక ముసాయిదా ప్రణాళిక ప్రస్తుతం ఇరు దేశాల పరిశీలనలో ఉన్నట్లు విదేశీ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.

ఈ ప్రతిపాదనలో 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణతో పాటు, ఆ వ్యవధిలో శాశ్వత పరిష్కారం కోసం మరింత విస్తృత చర్చలు జరిపే అవకాశం కల్పించే అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ రాజీ ప్రయత్నాల్లో పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టుతో పాటు కొన్ని గల్ఫ్ దేశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్షంగా కాకపోయినా, మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ ప్రతిపాదనలో ప్రధానంగా చర్చకు వచ్చిన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఇప్పటికీ జాగ్రత్త వైఖరినే అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం మాత్రమే హర్మూజ్‌ను తెరవాలన్న ఒత్తిడిని తమ దేశం సులభంగా అంగీకరించబోదని ఇరాన్‌కు చెందిన వర్గాలు స్పష్టం చేసినట్టు కథనాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, ఇరాన్ తరఫున శాశ్వత శాంతికి స్పష్టమైన హామీలు లేకుండా తాత్కాలిక ఒప్పందాలపై ముందుకు వెళ్లడంపై అప్రమత్తత వ్యక్తమవుతోంది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉంటామని ఇరాన్ ప్రతినిధులు సంకేతాలిచ్చారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో హర్మూజ్ అంశంపై గడువు విధించగా, ఆ ఒత్తిడి మధ్య ఈ 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

అదే సమయంలో, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మాజిద్ ఖాదేమీ మృతి చెందినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఈ పరిణామం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నప్పటికీ, మరోవైపు దౌత్యపరమైన చర్చలు కూడా వేగం అందుకోవడం గమనార్హం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp