Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeSportsAbhishek Sharma | అంపైర్ నిర్ణయంపై అసహనం.. అభిషేక్ శర్మకు ఐపీఎల్ ఫైన్

Abhishek Sharma | అంపైర్ నిర్ణయంపై అసహనం.. అభిషేక్ శర్మకు ఐపీఎల్ ఫైన్

-

Chat on WhatsApp

Abhishek Sharma: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ అధికారులు జరిమానా విధించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు.

ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం, అభిషేక్ ఆర్టికల్ 2.3 కింద లెవల్-1 నేరాన్ని అంగీకరించి, మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని స్వీకరించాడు. లెవల్-1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ తీర్పే తుది నిర్ణయమని ఐపీఎల్ స్పష్టం చేసింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్(SRH) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ, అభిషేక్ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 21 బంతుల్లో 48 పరుగులు చేసి దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు.

తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదుతూ కేకేఆర్ బౌలర్లపై దాడి చేశాడు. అయితే ఔటైన తర్వాత అతని ప్రవర్తనపై ఐపీఎల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముజర్బానీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అభిషేక్, డీప్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌పై టీవీ అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన అతడు, పెవిలియన్ వైపు వెళ్తూ అసహనం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

ఇదే ఘటనపై ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అభిషేక్ శర్మకు, ఈ వివాదం మాత్రం ఊహించని ఎదురుదెబ్బగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp