Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshSaleswaram Yatra | నల్లమలలో శివనామస్మరణ.. సలేశ్వరం లింగమయ్య యాత్రకు పోటెత్తిన భక్తులు

Saleswaram Yatra | నల్లమలలో శివనామస్మరణ.. సలేశ్వరం లింగమయ్య యాత్రకు పోటెత్తిన భక్తులు

-

Chat on WhatsApp

Saleswaram Yatra: దట్టమైన నల్లమల అడవిలో వెలసిన ప్రసిద్ధ సలేశ్వరం లింగమయ్య సాహస యాత్ర ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి కేవలం మూడు రోజులపాటు మాత్రమే అనుమతి ఉండే ఈ పవిత్ర యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు అడవి మార్గంలో కాలి బాట పట్టడంతో నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోయింది.

ప్రకృతి ఒడిలో, జలపాతాల నడుమ వెలసిన సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో అడవి దారిలో ముందుకు సాగుతున్నారు.

ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, లోయలు, జారుడు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు సహనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cessna 402 plane crash in bahamas kills 10 people after takeoff

Bahamas Plane Crash | గాల్లోకి  ఎగిరిన కొద్దిసేపటికే కూలిన విమానం.. 10 మంది దుర్మరణం

Bahamas Plane Crash: బహామాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో బయలుదేరిన ఓ చిన్న విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలడంతో అందులో ఉన్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు....
- Advertisement -
Chat on WhatsApp