Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeInterNationalIran Us Israel War | పశ్చిమాసియాలో 28 రోజుల యుద్ధం... ఎవరికి లాభం? ఎవరికి...

Iran Us Israel War | పశ్చిమాసియాలో 28 రోజుల యుద్ధం… ఎవరికి లాభం? ఎవరికి నష్టం ?

-

Chat on WhatsApp

Iran Us Israel War: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం 28వ రోజుకు చేరుకుంది.దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఘర్షణ మూడు దేశాలకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. ముఖ్యంగా ఇరాన్‌పై ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇరాన్‌లో సుమారు 1,900 మంది మరణించినట్లు సమాచారం. వీరిలో 175 మంది పాఠశాల విద్యార్థినులు ఉన్నారు. సుమారు 32 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌కు చెందిన 10 వేలకుపైగా లక్ష్యాలు ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

భూగర్భ రక్షణ కేంద్రాలు, మిసైల్ ఫ్యాక్టరీలు, ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు, మిలిటరీ బేస్‌లు, ఆయిల్ డిపోలు, ఎనర్జీ సైట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 16 వేలకుపైగా ఇళ్లు కూలిపోయాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇరాన్‌కు దాదాపు 150 నుంచి 200 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగి ఉండొచ్చని అంచనా.ఇక ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు కూడా లక్ష్యంగా మారాయి.ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.అమెరికాకు 18 నుంచి 40 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో 28 మంది మరణించగా, 5 వేల మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్‌కు 28 నుంచి 32 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.

ఇక హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు సరఫరా దెబ్బతింది.దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.మరోవైపు శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, యుద్ధం ఎప్పుడు ఆగుతుందన్నది ఇంకా స్పష్టత రాలేదు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp