Friday, April 3, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTAllu Arjun | భారతీయ సంస్కృతిని జపాన్‌కు చాటిచెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఫ్యాన్స్...

Allu Arjun | భారతీయ సంస్కృతిని జపాన్‌కు చాటిచెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫిదా

-

Chat on WhatsApp

Allu Arjun: సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో కూడా తాను మరోసారి నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun).

తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కొసానోతో జరిగిన ప్రత్యేక సమావేశంలో బన్నీ అందించిన కానుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ భేటీలో అల్లు అర్జున్, భారతీయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే అత్యంత పవిత్రమైన “సీతా-రామ కళ్యాణం” పెయింటింగ్‌ను కొసానోకు బహుమతిగా అందజేశారు.

ఈ కానుక కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, ధర్మం, ప్రేమ, త్యాగం, భక్తి వంటి శాశ్వతమైన భావాల ప్రతీకగా నిలిచింది. ముఖ్యంగా రామాయణంలో సీతారాముల కల్యాణ ఘట్టం భారతీయ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

అలాంటి గొప్ప అర్థం ఉన్న బహుమతిని అందించడం ద్వారా బన్నీ తన సంస్కృతిపట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటిచెప్పారు.



ఇంతటితో ఆగకుండా, ఆ పెయింటింగ్ వెనుక ఉన్న భావాన్ని, రామాయణం అందించే జీవన విలువలను అల్లు అర్జున్ స్వయంగా జపాన్ సీఈఓకు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ధర్మం, కర్తవ్యబోధ, త్యాగం, మానవత్వం వంటి విలువలు దేశాలు, భాషలు, సంస్కృతులు వేరు అయినా ప్రతి మనిషిని ఒకటిగా కలుపుతాయని ఆయన చెప్పిన మాటలు టొమాట్సు కొసానోను బాగా ప్రభావితం చేశాయి.

దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో క్రేజీ మూవీ కూడా లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ల చేతుల్లో ఉండటంతో బన్నీ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp