Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRam Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు మంచి...

Ram Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు మంచి మనసు

-

Chat on WhatsApp

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

ఇదే సమయంలో ఆయన నటిస్తున్న ‘పెద్ది’(PEDDHI) సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఈ వీడియోలో చరణ్ కండలు తిరిగిన శరీరంతో మల్లయోధుడి పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు(Happy Birth Day Ram Charan) తెలుపుతూ, చిన్నతనంలో తన చేయి పట్టుకుని నడిచిన చరణ్ నేడు లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు.

కుటుంబ విలువలు, క్రమశిక్షణ, దైవభక్తి చరణ్‌ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాయని కొనియాడారు. అలాగే ఎన్టీఆర్ అవార్డు ద్వారా వచ్చిన రూ.10 లక్షల నగదు బహుమతిని వివిధ ఫౌండేషన్లకు విరాళంగా అందిస్తూ తన సేవా మనసును మరోసారి చాటుకున్నారు.

ఒక స్వచ్ఛంద సంస్థను సందర్శించిన చరణ్, అక్కడి వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా ఆహారం వడ్డించి, కొత్త దుస్తులు పంపిణీ చేశారు.

ఈ దృశ్యాలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. మరోవైపు అల్లు అర్జున్, అన్నా లెజ్నోవా, సుస్మిత కొణిదెల తదితరులు కూడా చరణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp