Varanasi Movie Set: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’(Varanasi) సినిమా సెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా విడుదలైన సెట్స్ చిత్రాలు, వీడియోలు చూసిన సినీప్రియులు రాజమౌళి విజన్‌ను మరోసారి ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కాశీ నేపథ్యంలో సాగుతుండటంతో, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాన్ని అచ్చం ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించారు.
దాదాపు 700 x 400 అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెట్లో కాశీ వీధులు, ఘాట్లు, పురాతన కట్టడాలను నిజానికి దగ్గరగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
సెట్‌లో ప్రతి చిన్న వివరాన్ని కూడా జాగ్రత్తగా రూపొందించేందుకు వేల సంఖ్యలో రిఫరెన్స్ ఫొటోలు, ఖచ్చితమైన కొలతలను ఉపయోగించినట్లు చిత్రబృందం తెలిపింది. ముఖ్యంగా రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఈ సెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అసలు ఆలయం గోపురం వంపు తిరిగిన విధానాన్ని సెట్‌లో కూడా అదే రీతిలో ప్రతిబింబించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిల్పకళ, అలంకరణలో ఎక్కడా రాజీపడకుండా అత్యంత నాణ్యతతో నిర్మాణం సాగించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కథ త్రేతాయుగం నుంచి ఆధునిక కాలం వరకు సాగుతుందని సమాచారం. అందుకు అనుగుణంగా వారణాసి నగరం కాలక్రమేణా ఎలా మారిందో చూపించేందుకు సెట్లో విభిన్న మార్పులు చేశారు. పురాతన నిర్మాణాల నుంచి ఆధునిక నగర రూపం వరకు అన్ని దశలను ప్రతిబింబించేలా డిజైన్ చేశారు.
ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఈ సినిమాను 120 దేశాల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.








