Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTTD Annual Budget | ఒంటిమిట్టలో 108 అడుగుల విగ్రహం...టీటీడీ కీలక నిర్ణయం

TTD Annual Budget | ఒంటిమిట్టలో 108 అడుగుల విగ్రహం…టీటీడీ కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

TTD Annual Budget: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌కు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బడ్జెట్ ద్వారా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ధార్మిక కార్యక్రమాల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుపతిలోని వకుళమాత ఆలయంలో ‘గోవింద అక్షరమాల’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

అలాగే ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తుతో జాంబవంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రూ.20.17 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారు. ఈ విగ్రహం ప్రాంతీయ పర్యాటకాభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

ఇక ఒంటిమిట్టలో జరిగే కోదండరామస్వామి కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయాలని కూడా బోర్డు నిర్ణయించింది.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. భక్తుల సేవ, సదుపాయాల మెరుగుదల, ధార్మిక కార్యక్రమాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.

ALSO READ:London Fire Accident | లండన్ అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృ**తి

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp