Wednesday, April 15, 2026
Chat on WhatsApp
HomeSportsT20 World Cup 2026 | తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మొనగాళ్లు...ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్...

T20 World Cup 2026 | తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మొనగాళ్లు…ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే

-

Chat on WhatsApp

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026లో కరీబియన్ స్టార్ బ్యాటర్ “Shimron Hetmyer” చరిత్ర సృష్టించాడు. సూపర్-8 దశలో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి వెస్టిండీస్ తరఫున అత్యంత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. అతడి దూకుడు ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ జట్టు సెమీస్ రేసులో ముందంజ వేసింది.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటికీ అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు “Yuvraj Singh” పేరిటే ఉంది. 2007లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 బంతుల్లో అర్ధశతకం బాదుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత కూడా అతనిదే.

ఆస్ట్రేలియా తరఫున “Marcus Stoinis” 2022లో 17 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేశాడు. పాకిస్తాన్ వెటరన్ “Shoaib Malik” 18 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. శ్రీలంక కెప్టెన్ “Dasun Shanaka”19 బంతుల్లో ఫిఫ్టీ బాదగా, దక్షిణాఫ్రికా కెప్టెన్ “Aiden Markram” కూడా అదే వేగంతో అర్ధశతకం నమోదు చేశాడు.

బంగ్లాదేశ్ తరఫున “Mohammad Ashraful” 20 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. జింబాబ్వే ఆటగాడు “Elton Chigumbura” 21 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ “Will Jacks” 21 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు.

న్యూజిలాండ్ తరఫున “Glenn Phillips” 22 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. అఫ్గానిస్తాన్‌కు చెందిన “Shafiqullah” 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.

ALSO READ:IPL 2026 | చెన్నై ఫ్యాన్స్‌కు షాక్…ధోని పూర్తి సీసన్ ఆడకపోవచ్చు…?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

KCR supports Women’s Reservation Bill while expressing concerns over delimitation impacts on South India

Women’s Reservation Bill | మహిళల రిజర్వేషన్‌పై బీఆర్‌ఎస్ కీలక నిర్ణయం

Women’s Reservation Bill: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో కేటీఆర్, హరీష్ రావులతో...
- Advertisement -
Chat on WhatsApp