Monday, August 3, 2026
Chat on WhatsApp
HomeNationalNationwide Bank Strike | రేపు బ్యాంకులు బంద్‌? తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

Nationwide Bank Strike | రేపు బ్యాంకులు బంద్‌? తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

-

Chat on WhatsApp

Nationwide Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 12 (గురువారం)న ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు బ్యాంకులు పనిచేయకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ముందస్తుగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం అందించింది.

ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI)తో పాటు పది కేంద్ర కార్మిక సంఘాలు (CTUలు) పాల్గొననున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

ప్రభుత్వం గత ఏడాది నోటిఫై చేసిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగానే ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘాలు స్పష్టం చేశాయి. ఈ కోడ్‌లు కార్మిక వ్యతిరేకంగా ఉండటమే కాకుండా, ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్‌పై కఠిన నిబంధనలు విధిస్తున్నాయని ఆరోపించాయి.

అలాగే వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయడం, ఉద్యోగులకు మెరుగైన పని–జీవిత సమతుల్యత కల్పించాలనే డిమాండ్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అధికారికంగా సెలవు ప్రకటించకపోయినా, సమ్మె కొనసాగితే బ్యాంకు శాఖలు, లావాదేవీలు, కార్యాలయాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశముంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh Supports PM Modi's Nasha Mukt Yuva Campaign Against Drugs

Nara Lokesh | డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. ప్రధాని కార్యక్రమానికి లోకేశ్ పూర్తి...

Nara Lokesh: మత్తు పదార్థాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ(Nasha Mukt Yuva) ఫర్ వికసిత్ భారత్(Viksit Bharat) సంకల్ప్ అభియాన్’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి...
- Advertisement -
Chat on WhatsApp