Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeNationalElectric Cars 2026 | భారత్‌లో హల్‌చల్ చేయనున్న EVలు

Electric Cars 2026 | భారత్‌లో హల్‌చల్ చేయనున్న EVలు

-

Chat on WhatsApp

Electric Cars 2026: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పర్యావరణ హితం, తక్కువ నిర్వహణ ఖర్చులు కారణంగా EVల వైపు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా, మారుతి సుజుకి, టయోటా, కియా వంటి ప్రముఖ ఆటో బ్రాండ్లు 2026లో కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. 2026లో రానున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇవే.

దేశీయ EV మార్కెట్‌లో ముందంజలో ఉన్న టాటా మోటార్స్ ఇప్పటికే నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV వంటి మోడళ్లతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్‌ను 2026 ఫిబ్రవరి 20న విడుదల చేయనుంది.

ఇది 25 kWh, 35 kWh బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. గరిష్టంగా 365 కిలోమీటర్ల రేంజ్, మెరుగైన టెక్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఇది మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.

అదేవిధంగా టాటా సియెర్రా EV కూడా ఈ ఏడాది తొలి అర్థభాగంలో లాంచ్ కానుంది. Acti.EV+ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతున్న ఈ SUVలో 55 kWh, 65 kWh బ్యాటరీలు, డ్యుయల్ మోటార్ AWD ఆప్షన్ ఉండనుంది.

మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ SUV ‘e Vitara’ను విడుదల చేయనుంది. ఇది 543 కి.మీ వరకు రేంజ్ ఇచ్చే సామర్థ్యంతో, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో రాబోతోంది. దీనికి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV పోటీగా నిలవనుంది.

ఇక కియా సైరోస్ EV మిడ్-సైజ్ ఫ్యామిలీ SUVగా మార్కెట్‌లోకి రానుంది. ఆధునిక కనెక్టెడ్ ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో ఇది యువతను ఆకట్టుకోనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp