Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeInterNationalU19 World Cup Final | వైభవ్ సూర్యవంశీ షో.. భారత్‌కు ఆరో కప్

U19 World Cup Final | వైభవ్ సూర్యవంశీ షో.. భారత్‌కు ఆరో కప్

-

Chat on WhatsApp

U19 World Cup Final: భారత క్రికెట్ మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. అండర్‌–19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో యువ భారత్ అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి ఆరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.హరారేలో జరిగిన ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు సాధించింది.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (175; 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, ఇంగ్లిష్ బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆయుష్ మాత్రే (53), అభిజ్ఞాన్ కుండు (40), కనిష్క్ చౌహాన్ (37*) కీలకంగా రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అంబ్రిష్, కనిష్క్, దీపేశ్ ప్రభావవంతంగా బౌలింగ్ చేశారు. ఫైనల్‌లో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కూడా గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. యువకుల ఈ విజయం భారత క్రికెట్‌కు మరో స్వర్ణ అధ్యాయంగా నిలిచింది.

also read:India-US Trade Deal: భారత ఉత్పత్తులపై US సుంకాలు తగ్గింపు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp