Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadGas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

-

Chat on WhatsApp

HYDERABAD: కూకట్‌పల్లిలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌(gas delivery boy)గా పనిచేస్తున్న గాదె అజయ్‌ (21) గంజాయి సరఫరా వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారుల దృష్టికి చిక్కాడు. ఇంటింటికీ సిలిండర్లు అందిస్తూ వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో అదనపు సంపాదన కోసం అక్రమంగా గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు.

గంజాయి తీసుకునే వారు ఆర్డర్‌ ఇస్తే నేరుగా వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తున్నాడు. ఇస్తావా హోమ్స్‌ ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది నిఘా పెట్టి అజయ్‌ను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 580 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసి, నిందితుడితో పాటు కూకట్‌పల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ALSO READ:Telangana junior kho kho tournament | పఠాన్ చెరు మైదానంలో 44వ తెలంగాణ జూనియర్ ఖో ఖో పోటీలు..

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

extreme heatwave across europe with temperatures above 40 degrees celsius

Europe | యూరప్‌లో మండుతున్న ఎండలు.. 10 రోజుల్లో 1,300 మందికి పైగా.. ?

Europe: ఒకప్పుడు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన యూరప్‌ ఇప్పుడు తీవ్ర హీట్‌వేవ్‌తో సతమతమవుతోంది. పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోవడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. మండే ఎండలు,...
- Advertisement -
Chat on WhatsApp