Gujarat Ambulance Fire Accident: గుజరాత్‌లో నవజాత శిశువుతో సహా నలుగురి సజీవ దహనం అయ్యారు.అహ్మదాబాద్‌కు తరలించే సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ప్రయాణిస్తున్న ఓ అంబులెన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి డాక్టర్, నవజాత శిశువు సహా నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
పుట్టిన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ విషాదం జరిగింది.
ALSO READ:Pakistan Airbases Damage:భారత్ దాడులకు 6 నెలలైనా కోలుకొని పాక్
మంటలు చెలరేగిన సమయంలో పసికందు, చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ, డాక్టర్ శాంతిలాల్ రెంటియా, నర్సు భూరిబెన్ మానత్ అంబులెన్స్ వెనుక భాగంలో చిక్కుకుని మృతి చెందారు.
అంబులెన్స్ వెనుక భాగంలో మంటలు ఎగసిపడటాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపినా, లోపలున్న నలుగురిని రక్షించలేకపోయాడు. డ్రైవర్ అంకిత్ ఠాకూర్, గౌరంగ్ మోచీ, గీతాబెన్ మోచీ గాయాలతో బయటపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది.
