Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు.
ఏడాది క్రితం వేంపల్లెలోని రిటైర్డ్ MEO వీరారెడ్డికి వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో ఉన్న సిమ్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని నిందితులు భయపెట్టారు.
ఢిల్లీలో కేసు నమోదైందంటూ ఫేక్ సుప్రీంకోర్టు పత్రాలు వాట్సప్‌లో పంపించి “డిజిటల్ అరెస్టు” పేరుతో తక్షణం డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు.భయంతో వీరారెడ్డి తన బ్యాంక్ ఖాతా నుంచి లక్షల్లో మొత్తం పంపించగా, ఏడాది కాలంగా ముఠా నిరంతరం డబ్బులు వసూలు చేసింది.
ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి, డబ్బులు తీసుకోవడానికి ముఠా సభ్యులు వేంపల్లెకు వస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి 12 మందిని పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ:Teachers TET Tension: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన
