కర్నూలు జిల్లాకు చెందిన తెలుగు IPS అధికారి సందీప్ చక్రవర్తి మరోసారి తన ధైర్యం, తెలివితేటలతో దేశాన్ని గర్వపడేలా చేశారు. జైషే మొహ్మద్ ఉగ్రసంస్థ భారీ ఉగ్రదాడి పథకాన్ని భగ్నం చేసి, వందలాది ప్రాణాలను రక్షించారు. 2014 బ్యాచ్‌కు చెందిన సందీప్, గత కొంతకాలంగా కశ్మీర్ ప్రాంతంలో యాంటీ-టెర్రర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటివరకు ఆరు సార్లు ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఆయనకు మరో గొప్ప విజయాన్ని సొంతం చేశారు.
గత నెలలో కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో జైషే మొహ్మద్ పోస్టర్లు కనిపించడంతో అనుమానం వచ్చిన సందీప్ చక్రవర్తి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, పాత కేసుల నిందితులైన ముగ్గురిని గుర్తించారు.
ALSO READ:Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత
వారిని రెండు వారాలు విచారించిన అనంతరం, దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న డాక్టర్ల పేరుతో సాగిన ఉగ్రదాడి కుట్ర బయటపడింది.
ఈ సమాచారంతో భద్రతా బలగాలు సకాలంలో చర్యలు తీసుకొని భారీ విపత్తును నివారించాయి. సందీప్ చక్రవర్తి సాహసం మరోసారి తెలుగు యువతకు గర్వకారణమైంది.
