Thursday, March 5, 2026
No menu items!
Google search engine
HomeInterNationalShikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు 

Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు 

- Advertisement -
Google search engine

అమెరికా చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ప్రపంచ విమానయాన రంగంలో అగ్రగామి బోయింగ్‌(Boeing)కు అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది.

2019లో జరిగిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 మ్యాక్స్ ప్రమాదంలో మృ*తి చెందిన భారతీయ పౌరురాలు, ఐరాస కన్సల్టెంట్ శిఖా గార్గ్(Shikha Garg) కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 317 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.

ALSO READ:మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ స్కూల్ నిర్వహణలో కంటి పరీక్షలు

రూపకల్పన లోపాలు, హెచ్చరికల లోపం, భద్రతా నిర్లక్ష్యం వంటి కారణాలతోనే ప్రమాదం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది.ఆరేళ్ల న్యాయపోరాటం తర్వాత వచ్చిన ఈ తీర్పు శిఖా కుటుంబానికి పెద్ద ఊరటగా మారింది.

నైరోబీకి ఐరాస కార్యక్రమం కోసం వెళ్తున్న శిఖా ఉన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయి 150 మందికి పైగా మృతి చెందారు.

ఇదే మోడల్ విమానం ఐదు నెలల ముందు ఇండోనేసియాలో కూలిపోవడంతో రెండు ప్రమాదాల్లో కలిపి సుమారు 340 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 737 మ్యాక్స్(737 MAX Crash) కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. బోయింగ్‌పై పెరుగుతున్న విమర్శల మధ్య ఈ తీర్పు చారిత్రక మైలురాయిగా నిలిచింది.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular