Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUఏజన్సీలో 48 గంటల బంద్, ఆదివాసీల నిరసన కొనసాగు

ఏజన్సీలో 48 గంటల బంద్, ఆదివాసీల నిరసన కొనసాగు

-

Chat on WhatsApp

ఏజన్సీలో రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా 48 గంటల నిరవధిక బంద్ కొనసాగుతోంది. 1/70 చట్ట పరిరక్షణ డిమాండ్‌తో ఆదివాసీలు, వామపక్షాలు నిరసనకు దిగారు. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

బంద్‌లో భాగంగా వ్యాపార సంస్థలు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు బంద్‌కు పూర్తి మద్దతు తెలిపినట్లు కనిపిస్తోంది. రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

బంద్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, గంప నాగరాజు, సింగిరెడ్డి అచ్చారావు, కొండ్ల సూరిబాబు, కుంజం జగన్నాధ రావు, చీడి శివ, ఈక శ్రీనుబాబు, బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బంద్ విజయవంతం చేస్తున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp