కల్తీ నెయ్యి స్కాంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 13న విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు పంపినా, సుబ్బారెడ్డి తనకు ఆ తేదీ కుదరదని, నవంబర్ 15 తరువాత హాజరవుతానని సమాధానం ఇచ్చారు.
వారం రోజుల గడువు కోరిన ఆయన ప్రవర్తనపై అధికారులు అనుమానంతో ఉన్నారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి కోర్టు ద్వారా విచారణను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బ్యాంకు లావాదేవీల వివరాల కోసం కోర్టును ఆశ్రయించారు.
ఇక మరోవైపు, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అలిపిరి సిట్ కార్యాలయంలో సీట్ డీఐజీ మురళి లాంబ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు.
ALSO READ:నిషేధిత బెట్టింగ్ యాప్ కేసులో సిట్ ముందుకు విజయ్ దేవరకొండ
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు ధర్మారెడ్డి ప్రయత్నించగా, అదే సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ లడ్డూలతో రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కల్తీ నెయ్యి వ్యవహారం ఈవోకి తెలియకుండా జరగడం అసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ధర్మారెడ్డి ఐదు సంవత్సరాల పాటు టీటీడీలో కీలక పాత్ర పోషించారని, మొదట జేఈవోగా చేరి తర్వాత అర్హత లేకపోయినా ఈవోగా నియమించబడ్డారని సమాచారం.
సాధారణంగా ఐఏఎస్ అధికారులకు మాత్రమే అర్హత ఉన్నప్పటికీ, రక్షణ శాఖ ఉద్యోగిగా పనిచేసిన ధర్మారెడ్డి టీటీడీ ఈవోగానే రిటైరయ్యారు.
