Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిద్యార్థినులతో కాళ్లు నొక్కించిన లేడీ టీచర్‌ – ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు

విద్యార్థినులతో కాళ్లు నొక్కించిన లేడీ టీచర్‌ – ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు

-

Chat on WhatsApp

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్‌ వారినే కాళ్లు పట్టించుకోవడం సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి,సదరు ఉపాధ్యాయురాలు సుజాతను తక్షణం సస్పెండ్‌ చేసింది.సుజాత ఆ పాఠశాలలో హెడ్‌మిస్ట్రెస్‌గా (హెచ్‌ఎం) పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వైరల్‌ వీడియోలో ఆమె కుర్చీలో కూర్చుని మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగా, ఆమె ముందు ఇద్దరు విద్యార్థినులు నేలపై మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చెందడంతో ప్రజలు, తల్లిదండ్రులు, విద్యా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యా వ్యవస్థ పరువుని దెబ్బతీసే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసి, విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పూర్తి నివేదిక సమర్పించాలంటూ సూచనలు ఇచ్చింది.

ఈ ఘటన విద్యారంగంలో క్రమశిక్షణా లోపాలపై మరోసారి చర్చకు దారితీసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

microsoft announces 4800 employee layoffs during global restructuring

Microsoftలో మరో భారీ లేఆఫ్స్.. 4,800 ఉద్యోగుల తొలగింపు ?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్(Microsoft) మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించిన నేపథ్యంలో సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను...
- Advertisement -
Chat on WhatsApp