ఎర్రకోట పేలుడు కేసులో కీలక మలుపు.దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు(Delhi blast) కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో కాన్పూర్‌లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో గత వారం అరెస్టయిన లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్‌తో ఆరిఫ్ నిరంతరం సంబంధంలో ఉన్నట్లు విచారణలో తేలింది.
షాహీన్ ఫోన్ రికార్డుల ద్వారా ఆరిఫ్ పేరు బయటపడింది. అనంతనాగ్‌కు చెందిన ఆరిఫ్, ఫరీదాబాద్ అల్-ఫలా యూనివర్సిటీలో చదువుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, కశ్మీర్‌కు చెందిన మరో డాక్టర్ నిసార్-ఉల్-హసన్(Kashmiri doctor missing) పేలుడు జరిగిన రోజు నుంచి అదృశ్యమయ్యాడు.
ALSO READ:Drone camera | పెళ్లికొడుకుపై కత్తితో దాడి..నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతడిని ప్రభుత్వ సేవల నుండి తొలగించగా, తర్వాత అదే యూనివర్సిటీ అతడిని నియమించుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలతో ఎర్రకోట పేలుడు కేసు మరింత గందరగోళంగా మారింది.
