Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeCrime Newsపూణేలో క్షణాల్లో రూ.5 లక్షల నగల దొంగతనం

పూణేలో క్షణాల్లో రూ.5 లక్షల నగల దొంగతనం

-

Chat on WhatsApp

మహారాష్ట్రలోని పూణేలో ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను క్షణాల్లో కొట్టేసి పారిపోయాడు. స్కూటీ పక్కనే నిల్చున్న మహిళను బైక్ పై వచ్చిన యువకుడు దృష్టి మళ్లించగా.. పక్కన నిల్చున్న యువకుడు స్కూటీ ముందు పెట్టిన బ్యాగు తీసుకుని పరుగందుకున్నాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ చోరీ ఘటన రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్కూటీపై వచ్చిన భార్యాభర్తలు రోడ్డు పక్కగా ఆగడం, భర్త పక్కకు వెళ్లగా భార్య అక్కడే నిలుచుని ఉండడం వీడియోలో కనిపిస్తోంది. ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారో తెలియదు కానీ ఓ యువకుడు అక్కడే తచ్చాడుతున్నాడు. ఇంతలో బైక్ పై వచ్చిన మరో యువకుడు ఏదో చెప్పడంతో ఆ మహిళ స్కూటీ వెనకకు వచ్చి టైరును గమనించింది. ఇంతలో స్కూటీ పక్కనే ఉన్న యువకుడు బ్యాగు తీసుకుని ఉడాయించాడు. క్షణాలలో జరిగిపోయిన ఈ ఘటన నుంచి ఆ మహిళ తేరుకుని దొంగ వెంటపడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బైక్ పై వచ్చిన యువకుడు, రోడ్డు పక్కన నిలుచున్న యువకుడు ఇద్దరూ తోడుదొంగలని స్థానికులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

pawan kalyan health update and bandla ganesh emotional post

Bandla Ganesh | పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన.. భావోద్వేగ ట్వీట్ చేసిన బండ్ల...

Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా సమాచారం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. వైద్య పరీక్షల్లో ఆయన రెండు భుజాల్లోని రొటేటర్ కఫ్...
- Advertisement -
Chat on WhatsApp